హుజురాబాద్ ఉప ఎన్నికంటే కేసీఆర్ భయపడ్తున్నాడు

హుజురాబాద్ ఉప ఎన్నికంటే కేసీఆర్ భయపడ్తున్నాడు
  • ఎన్నిక వాయిదా కోసమే ఈసీకి తప్పుడు నివేదిక: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికంటే కేసీఆర్ భయపడ్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తప్పుడు నివేదిక పంపించారని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చిందని, అందుకే వాయిదాకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. 
హుజూరాబాద్ ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీనే
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీ పార్టీయేనని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రకు వస్తోన్న ఆదరణతో టీఆర్ఎస్ భయపడ్తోందన్నారు. తప్పుడు నివేదికల ద్వారా ఎన్నికను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయించిందని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా హుజురాబాద్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభతో కేసీఆర్ గుండెలు అదరటం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక  లోపు దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేపిస్తామని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.